ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తనకు భయపడి తన పార్టీ గుర్తు మార్చేసి కుండ గుర్తు కేటాయించడంపై మండిపడ్డారు. గురువారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం ఓటర్లు తనను కోరుకుంటున్నారని అన్ని సర్వేలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. విశాఖపట్నంకు గుండెకాయ లాంటి స్టీల్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ భూమిని అమ్మేశారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తనను ఓడించేంతా దమ్ములేదని, టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని పేర్కొన్నారు.
