ఎన్నికల వేళ విద్వేష ప్రసంగిస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను మోడీ, రాహుల్ ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చినట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 29 ఉదయం 11 గంటల లోపు ఇరువురు నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ చేసిన ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఇద్దరు నేతలు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్వేషపూరిత ఆరోపణలు, విమర్శలు చేస్తూ ప్రసంగించారు. ఈ వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్‌ను ఈసీ వివరణ కోరింది. అలాగే మోడీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అనుసరిస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, అది పార్టీ బాధ్యత అని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.
