AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుత్తా ఇంటికి కుందూరు.. నల్లగొండ జిల్లాలో రంజుగా రాజకీయాలు

సర్వత్రా హాట్‌ టాపిక్‌

(అమ్మన్యూస్‌, నల్లగొండ):
నల్లగొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌ రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రఘువీర్‌ రెడ్డి వెళ్లి మద్దతు కోరారు.

ఆ సమయంలో సుఖేందర్‌ రెడ్డి తనయుడు అమిత్‌ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. రఘువీర్‌ రెడ్డితో పాటు ఆయన తండ్రి మాజీ మంత్రి జానారెడ్డి కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే సీఎం రేవంత్‌ రెడ్డి ఆపరేషన్లో భాగంగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆయన తనయుడు అమిత్‌ రెడ్డి హస్తం గూటికి వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శ లు చేసిన రెండు రోజుల్లోనే అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతలు నేరుగా ఇంటికి రావడం అంటే గుత్తా మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ANN TOP 10