AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓటు వేయకపోయినా..నా అంత్యక్రియలకైనా హాజరవ్వండి : ఖర్గే ఎమోషనల్

తన కంచుకోట అయిన కలబురగి నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటెయొద్దనుకున్న వారు కనీసం తాను చేసిన అభివృద్ధి పనులైనా గుర్తు చేసుకోవాలని అన్నారు. తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరు కావాలని అన్నారు. బుధవారం ఆయన, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతో కలిసి ప్రచారం నిర్వహించారు. ‘‘మీరు ఈసారి ఓటు మిస్సైతే మీ గుండెల్లో నాకు ఇకపై స్థానం లేదని భావిస్తా’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. కలబురగి స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమని బరిలో ఉన్నారు. బీజేపీ తరుపున సిట్టింట్ ఎఉంపీ ఉమేశ్ జాదవ్.. తన స్థానం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాను రాజకీయాలకోసమే పుట్టానని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా ఊపిరి ఉన్నంత వరకూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పారు. రాజకీయాల నుంచి రిటైరయ్యే ప్రసక్తే లేదని అన్నారు. రాజకీయనాయకులు పదవులకు దూరమైనా సిద్ధాంతాలను మాత్రం వదులుకోకూడదని సూచించారు. ‘‘నేను సీఎం సిద్దరామయ్యకు ఇదే చెబుతుంటా. సీఎంగా ఎమ్మెల్యేగా రిటైర్ అయినా బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి రిటైర్ అయ్యేవరకూ రాజకీయాల నుంచి తప్పుకోకూడదు’’ అని ఖర్గే అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10