AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

30న టెన్త్‌ ఫలితాలు .. ఎన్నింటికి అంటే..?

హైద‌రాబాద్ : ఈ నెల 30వ తేదీన ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఇంట‌ర్మీడియట్ ఫ‌లితాల విడుద‌ల సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని విద్యాశాఖ కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం వెల్ల‌డించారు. మూల్యాంక‌నం పూర్త‌యింద‌ని, డీకోడింగ్ ప్ర‌క్రియ కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకుంద‌న్నారు. 30వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు ప‌ది ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఇక ఈ ఏడాది 5,08,385 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వ‌ర‌కు 2,676 ప‌రీక్షా కేంద్రాల్లో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

ANN TOP 10