AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈదురుగాలులకు కూలిన మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఈదురుగాలులకు కుప్పకూలిపోయింది. సోమవారం అర్ధరాత్రి ముత్తారం మండలం ఓడేడు పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఓడుడు నుంచి భూపాలపల్లి జిల్లా గుర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు మానేరు నదిపై 2016లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్లు మారడం, నిధుల లేమితో వంతెన నిర్మాణం ఆగిపోయింది. అయితే సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులతో బ్రిడ్జి గడ్డర్లు కూలిపోయాయి.


కాగా, అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పగటివేళ రాకపోకల సమయంలో కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని అన్నారు.

ANN TOP 10