ముఖ్యమంత్రి వరకు తన ప్రస్థానం కొడంగల్ నుంచే ప్రారంభమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కొడంగల్ సెగ్మెంట్ మద్దూరులో కార్యకర్తలతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల కొడంగల్‌కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందన్నారు. ఎవరికైనా సీఎం పదవి ఇచ్చే స్థాయికి కొండగల్‌ను కాంగ్రెస్ చేర్చిందన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌లా ఫామ్ హౌస్‌తో పడుకోకుండా తాను ప్రజల్లోకి వెళ్తున్నానని చెప్పారు. దొంగదెబ్బ తీయాలని బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. మక్తల్ ఎత్తిపోతలకు ఆనాడు డీకే అరుణ అడ్డుపడ్డారని తెలిపారు. కృష్ణా జలాలు, రైల్వే లైన్లు రాకుండా కూడా డీకే అరుణ అడ్డుపడినట్టు చెప్పారు. మంత్రిగా ఉండి ఆమె ఈ ప్రాంతానికి ఏమి చేయలేదన్నారు. శత్రవు చేతిలో కత్తివై పాలమూరు కంట్లో పొడుస్తున్నావని విమర్శించారు. డీకే అరుణ సొంత నియోజకవర్గంలోనే బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదన్నారు. పాలమూరు అభివృద్ధి అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు నుంచి గతంతో కేసీఆర్‌ను గెలిపిస్తే పోయి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని విమర్శించారు.
కేసీఆర్, హరీష్ రావులకు సవాల్
ఇప్పుడు వంశీ చంద్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని పదేళ్ల అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో రూ. 3, 900 లోటుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగించారన్నారు. కేసీఆర్ పదేళ్లలో చేసిన అప్పులకు 4 నెలల్లో రూ. 26 వేల కోట్ల మిత్తీ కట్టినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణానికి రూ. 1300 కోట్లు ఆర్టీసీకి కట్టామని గుర్తు చేశారు. తాగుబోతు కేసీఆర్ చేతిలో రాష్ట్రాన్ని పెడితే అప్పుల కుప్ప చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంద్రాగస్టు లోపు రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తే కేసీఆర్, హరీష్ రావు పార్టీని రద్దు చేసుకుంటారా అని సవాల్ విసిరారు. కేసీఆర్ చేసిన రుణమాఫీ మిత్తీలకు కూడా సరిపోలేదన్నారు. రైతులతో బ్యాంకు అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతుల్ని బ్యాంకర్లు ఇబ్బందులు పెడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఓవైపు సన్న వడ్లు వేయమన్నాడు.. మరోవైపు వరేస్తే ఉరే అన్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.