తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సోమవారం చేవెళ్ల పార్లమెంట్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తదితరులున్నారు. ఇక ఆయన ఆస్తి వివరాలు చూసి షాక్ అవుతున్నారు. అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర రెడ్డి రికార్డులోకి ఎక్కాడు. అతని కుటుంబ ఆస్తుల విలువ రూ.4,568 కోట్లుగా అఫిడవిట్ దాఖలు చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు మీద రూ.1240 కోట్లు, అతని సతీమణి పేరు మీద రూ.3,208 కోట్లు, కుమారుడు పేరు మీద రూ.108 కోట్ల ఆస్తులు ఉన్నాయి.









