ముదిరాజ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం హామీ ఇచ్చారో చెప్పాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో క్రాస్ టాక్ తెలంగాణ జర్నలిస్ట్ యునియన్‌తో మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎన్నికల వేళ ఏదైనా మాట్లాడతాం అంటే సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని రఘునందన్ సూచించారు. ఇటీవల ఆదిలాబాద్‌లో మోడీని పెద్దన్న అన్నది రేవంత్‌రెడ్డే అని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి కేరళ ప్రచారానికి వెళ్లినప్పుడు కమ్యూనలిస్టులు అన్నారని చెప్పారు. ఏది నమ్మాలి సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణకు వచ్చాక కమ్యూనిస్టులను పొగుడుతారని ఏది నమ్మాలని నిలదీశారు. తాము గడీల్లో ఉన్నామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, ఎక్కడ ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోని వచ్చారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హమీలు అమలు చేయలేదంటూ మండిపడ్డారు. వాటిని వెంటనే అమలు చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిలా డయల్ రోల్ తాను చేయలేనన్నారు. మోడీ పాలన చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ సర్వేలు చూసినా మోడీ మూడోసారి ప్రధాని అవుతారని వస్తున్నాయన్నారు. ఇంకా కొన్ని అంశాలు మిగిలి పోయాయి కాబట్టి 400 సీట్లు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు తీసుకొని నిర్ణయాలు మోడీ అమలు చేస్తున్నారని చెప్పారు.
*దుబ్బాక అభివృద్ధిపై చర్చకు సిద్ధమా!*
కూరగాయలు అమ్మే వారు కూడా డిజిటల్ పేమెంట్స్ పెట్టుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌కి హామీలు ఇచ్చి మర్చిపోవడం అలవాటే అని, ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా హామీలు పెట్టిందన్నారు. పోలవరంకు ఆరోజే జాతీయ హోదా ఇవ్వాల్సిందన్నారు. ఒక్క రాష్ట్రంలో ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇచ్చి రెండవ రాష్ట్రానికి ఇవ్వకపోవడం ఏంటి? అని ప్రశ్నించారు. హామీలు ఇవ్వడం కాంగ్రెస్ వంతు అమలు చేయడం మా వంతు అని చెప్పారు. తాను దుబ్బాకకు ఏమి చేశానో ఒక పుస్తకం తయారు చేసి.. మా నియోజకవర్గంలో 75 వేల మందికి పంపిణీ ఇస్తానని అన్నారు. మీరు ఎప్పుడు వచ్చినా సరే.. మా గడీని మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని తెలిపారు. దుబ్బాక అబివృద్ధి పై మీరెప్పుడు వచ్చిన నేను రెడీ అని సవాల్ విసిరారు. కావాలంటే బస్సు ఖర్చులు కూడా నేనే ఇస్తానని తెలిపారు. దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ రావు మెదక్‌లో పనికి వస్తారా? అని హరీష్ రావు, రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ రేపటి నుంచి బస్సు యాత్ర ఎలా చేపడతారని, 2018లో కొడంగల్‌లో ఓడిన రేవంత్ మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడుతున్నారని, మీ కేబినెట్‌లో బీసీలు ఎంత మంది ఉన్నారని నిలదీశారు. కాంగ్రెస్‌లో ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా.. గెలిచిన ఆ ముదిరాజు బిడ్డకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి డబుల్ డిజిట్ వస్తే తెలంగాణలో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో రేవంత్‌కి బాగా తెలుసని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.