AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గురుగ్రామ్‌లో విషాదం.. శ్మశాన వాటిక గోడ కూలి 5 మంది..

హర్యానా: హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. గురుగ్రామ్‌లో శనివారం గోడ కూలి ఓ చిన్నారి సహా ఐదురుగు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్ జిల్లా అర్జున్‌నగర్‌లోని ఓ స్మశాన వాటిక గోడ అకస్మాత్తుగా కూలింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఐదుగురిపై గోడ కూలిపోయింది.

స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు, ఇద్దరు కూలిన గోడ కింద చిక్కుకున్నారు. వారిలో చిన్నారి సహా, నలుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

మృతులు తాన్య(11), దేవి దయాల్(70), మనోజ్ గబా(54), కృష్ణ కుమార్‌(52), మరొకరిగా గుర్తించారు. దీప ప్రధాన్ అనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అర్జున్ నగర్‌లో గోడ కూలిన ఘటనలో ఐదుగురు మరణించారని గురుగ్రామ్ పోలీస్ పీఆర్వో తెలిపారు. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ANN TOP 10