AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ కుంభకోణాలన్నీ బయటకు తీస్తా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మైనంపల్లి

ఎన్నికల తరువాత నిద్రలేకుండా చేస్తా
ఆయన కుటుంబంతో మధ్యవర్తిత్వం చేసిన వారికీ జైలే..
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మైనంపల్లి

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన కుంభకోణాలన్నీ బయటకు తీస్తానని అన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ కుటుంబానికి నిద్ర ఇక కరువే నని మైనంపల్లి అన్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మధ్యవర్తిత్వం చేసిన వారికి జైలు తప్పదని హెచ్చరించారు.

24 మంది ఎమ్మెల్యేలు టచ్‌ లో ఉన్నారన్న కేసీఆర్‌ పై మండిపడ్డారు. కేసీఆర్‌ పై ప్రజలు తిరగబడతారన్నారు. మల్లన్న సాగర్‌ లో కుంభకోణాల చిట్టా విప్పుతామని దోషులను శిక్షిస్తామన్నారు. గత ప్రభుత్వం మల్లన్న సాగర్‌ నిర్వాసితులను రాసి రంపాన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం విషయంలో అన్యాయం చేసిందని ఆరోపించారు.

ANN TOP 10