AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు భువనగిరిలో సీఎం రేవంత్ పర్యటన

యాదాద్రి భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో నేడు సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రోడ్ షో, సభలో రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు. భువనగిరి సభకు సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.

ప్రచార సభల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. హామీల అమలుపై కూడా స్పష్టమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేసిన రేవంత్.. తన 100 రోజుల పరిపాలనతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఏం చేస్తాననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ చౌరస్తా, జగదేవ్ పూర్ రోడ్డు, పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ANN TOP 10