రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ శివరాంపల్లిలో నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఇన్నోవా కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు ముందు భాగం నుంచి మంటలను గమనించిన డ్రైవర్ కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. పోలీసులు (Police), అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. క్షణాల మీద కారు పూర్తిగా అగ్నికి అహుతయింది. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్డంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మండుతున్న ఎండలతో షార్ట్ సర్క్యూట్తో కారు తగలబడిందని ఫయర్ అధికారులు అంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
