AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఘోర రోడ్డు ప్రమాదం.. పెండ్లి బృందంలోని 9 మంది మృతి

రాజస్థాన్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఝలావర్‌ జిల్లాలో జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. ఓ పెండ్లి బృందం వ్యాను మధ్యప్రదేశ్‌లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఝలావర్‌ రహదారిపై ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా మరికొందరికి గాయాలు అయ్యాయని ఝలావర్‌ జిల్లా ఎస్పీ రిచాతోమర్‌ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించామని వివరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను అక్లెరా ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ANN TOP 10