నిజామాబాద్: పెండింగులో ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇంటి బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్, కోటగిరి, రుద్రూరు మండల కేంద్రాల్లో జరిగిన కార్నర్ మీటింగ్‌లలో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్‌తో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ… బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్లను కేవలం బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే మంజూరు చేసిందని తెలిపారు.