AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌తోనే సుపరిపాలన.. మంత్రి సీతక్క

– బీజేపీ, బీఆర్‌ఎస్‌ను తరిమేస్తేనే అభివృద్ధి
– దోస్తులకు దేశాన్ని దోచిపెడుతున్న మోదీ
– ఆదిలాబాద్‌లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి సీతక్క ఫైర్‌
– భారీగా హాజరైన కార్యకర్తలు

(అమ్మన్యూస్, ఆదిలాబాద్‌):
దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, గాంధీ సిద్ధాంతాలతో పరిపాలన కావాలని మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆదిలాబాద్‌ పట్టణంలోని రత్నా గార్డెన్‌లో ఎన్‌ఎస్‌ యూఐ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి స్వతంత్య్రం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది అని అన్నారు. దేశాన్ని మోదీ.. దోస్తులకు దోచి పెడుతున్నడాని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రెండు కోట్ల ఉద్యోగాల హామీ నెరవేరలేదని అన్నారు. ఇటీవల ఆదిలాబాద్‌కు వచ్చినప్పుడైనా నిధులిచ్చి సంతోషపెడతారనుకుంటే మొండి చెయ్యి చూపారన్నారు.
రాముడి పేరుతో రాజకీయం..
బీజేపీ రాముడి పేరుతో రాజకీయం చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. అభివృద్ధి గురించి అడిగితే ఇవిగో అక్షింతలు అంటూ పంపిస్తున్నారని అన్నారని మంత్రి ఎద్దేవా చేశారు. దేశం కోసం పదవులను త్యజించిన కుటుంబం గాంధీ కుటుంబమని అన్నారు. మోదీ రైతులకు రుణాలు మాఫీ కూడా చేయలేదన్నారు. కానీ బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం లోన్లు ఇస్తూ మాఫీ చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్‌ గాంధీకి సొంత ఇల్లు కూడా లేదని, కానీ ఛాయ్‌ వాలా అయిన మోదీ మాత్రం లక్షల సూట్‌ వేసుకుంటున్నరని సీతక్క మండిపడ్డారు. ఈ నెల 22న జరిగే ముఖ్యమంత్రి సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.


ఆత్రం విజయమే లక్ష్యం కావాలి: కంది
ఆదిలాబాద్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనావాసరెడ్డి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ విజయం కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ‘అమ్మన్యూస్‌’ సర్వేలలో సుగుణక్క దేపై చేయిగా ఉందని కంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, హాజరైన మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు, బోథ్‌ ఇన్‌చార్జి ఆడె గజేందర్, ఆసిఫాబాద్‌ ఇన్‌చార్జి శ్యాం నాయక్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10