AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చిట్కుల్‌లో నీలం ప్రత్యేక పూజలు.. తల్లిదండ్రుల స్మారక విగ్రహాలకు నమస్కారం

మధుకు నామినేషన్‌ పత్రాలు అందజేసిన మంత్రి కొండా సురేఖ

(అమ్మన్యూస్, సంగారెడ్డి):
మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ తల్లితో సమానమైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, పార్లమెంట్‌ ఇన్‌చార్జి కొండా సురేఖ, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డిల చేతుల మీదుగా నామినేషన్‌ పత్రాలను అందుకున్నారు. నీలం మధు నామినేషన్‌ దాఖలు సందర్భంగా చిట్కుల్‌ లో నీలం మధు తల్లిదండ్రులు నీలం నిర్మల్‌ రాధా స్మారక విగ్రహాలను మంత్రి కొండా సురేఖ, నిర్మలా జగ్గారెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా స్మారక విగ్రహాలకు నమస్కరించిన ఆమె నామినేషన్‌ పత్రాలను నీలం మధు ముదిరాజ్‌ కు అందజేసి దీవించారు.

తల్లిదండ్రుల స్మారక విగ్రహాల ఆశీర్వాదం ..
మెదక్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమాన్ని పురస్కరించుకొని తన స్వగ్రామమైన చిట్కుల్‌ లో ఇవాళ ప్రత్యేక హోమం నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదంతో వారి చేతుల మీదుగా నామినేషన్‌ పత్రాలను తీసుకుని, ఆ తర్వాత నీలం మధు తల్లిదండ్రుల స్మారక విగ్రహాలకు నమస్కరించి వారి ఆశీర్వాదంతో నామినేషన్‌ పత్రాలపై నీలం మధు ముదిరాజ్‌ సంతకం చేశారు.

ANN TOP 10