AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెయ్యి.. చేవళ్ల.. రంజిత్‌..

– రామబాణంలా దూసుకుపోతున్న మూడు పాశుపతాస్త్రాలు
– సోషల్‌ మీడియాలో రంజిత్‌ క్యాంపెయిన్‌ జోష్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
చెయ్యి.. చేవళ్ల.. రంజిత్‌.. ఇవి మూడు పదాలు మాత్రమే కాదు.. మూడు పాశుపతాస్త్రాలు. ప్రస్తుతం చేవెళ్ళ ప్రాంతంలోం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోన్న ఈ పదబంధాలు, కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ జి. రంజిత్‌ రెడ్డికి ఉపయోగపడుతున్నదని చెప్పకతప్పదు. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగాం. ఒక నినాదం పదే పదే ఆకట్టుకునేది. రాజన్న రాజ్యం, పేదల రాజ్యం అనేదే ఆ స్లోగన్‌. 2004, 2009 ఎన్నికల్లో అదే నినాదం కాంగ్రెస్‌ మాంచి ఊపును తెచ్చింది. వైఎస్‌ రాజశేఖర రెడ్డిని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసింది. కాంగ్రెస్‌కు అచ్చొచ్చిన మరో నినాదం ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. ఇది కూడా ఆ పార్టీకి పాపులర్‌ అయిన స్లోగన్‌. ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యేలా ఇలాంటి నినాదాలను వాడుతుండటం కాంగ్రెస్‌కు అచ్చొచ్చింది.

వినూత్న ఆలోచనతో ముందుకు..
ఇప్పుడు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేళ కూడా అలాంటి ప్రయోగాలే చేసిం ఔరా… అనిపించుకుంటున్నారు ఓ అభ్యర్థి. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ జి. రంజిత్‌ రెడ్డి! ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ బృందం ఈ వినూత్న ఆలోచనతో ముందుకెళుతోంది. ఒకే ఒక్క నినాదంతో నియోజకవర్గం, అభ్యర్థి పోటీ చేస్తున్న గుర్తుతో పాటు అభ్యర్థి పేరును కూడా జనానికి ఈజీగా అర్థమయ్యేలా రూపొందించి, సోషల్‌ మీడియాలో వదిలారు. ఆ నినాదమే… చెయ్యి (కాంగ్రెస్‌ పార్టీ గుర్తు హస్తం), చేవెళ్ల (నియోజకవర్గం), రంజిత్‌ (అభ్యర్థి పేరు)… ఈ వినూత్న ఆలోచన ఇప్పుడు జనంలో రామబాణంలా దూసుకుపోతోంది. చెయ్యి, చేవెళ్ల, రంజిత్‌ అనేవి మూడు పదాలు కావు, అవి ప్రత్యర్థులపై మూడు పాశుపతాస్త్రాలంటూ టీమ్‌ రంజిత్‌ రెడ్డి చెబుతోంది.

మరోవైపు చేవెళ్ల లోక్‌సభ పరిధిలో గత చరిత్రను పరిశీలిస్తే… కాంగ్రెస్‌కు కంచుకోటలుగా అనేక ప్రాంతాలు అక్కడున్నాయి. సాంప్రదాయక, స్థిరమైన ఓటు బ్యాంకు ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. దశాబ్దాలుగా హస్తం పార్టీగా రంగారెడ్డి జిల్లా, అందునా చేవెళ్ల నియోజకవర్గం అడ్డాలుగా ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌కు 6,75,898 లక్షల ఓట్లు (పోలైన ఓట్లలో 22.8 శాతం) వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక్కడ 6,62,344 (21.5 శాతం) ఓట్లు దక్కాయి. గత డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ గ్రాఫ్‌ బాగా పెరిగింది. ఈ క్రమంలో ఏకంగా 12,98,122 (33.8 శాతం) ఓట్లు దక్కించుకుని రికార్డు సృష్టించింది హస్తం పార్టీ. ఈ విధంగా ఏ కోణంలో చూసినా అధికార కాంగ్రెస్‌… ఆ అభ్యర్థికి అనేకాంశాలు కలిసొస్తున్నాయి. ఇప్పుడు దీనికి తోడు అగ్నికి వాయువు తోడైనట్టు చెయ్యి… చేవెళ్ల …నినాదం కూడా మరింత జోరుగా జనంలోకి దూసుకెళుతోంది. నినాదాలు, పార్టీ గత రికార్డులు, సాంప్రదాయక ఓటు బ్యాంకు… వెరసి రంజిత్‌ గెలుపు ఖాయమైపోయిందంటున్నారు విశ్లేషకులు. సో… ఇంతటి పవర్‌ఫుల్‌ నినాదాన్ని రూపొందించిన రంజిత్‌ టీమ్‌ను అభినందిద్దామా! రంజిత్‌ రెడ్డిని చేవెళ్ల గడ్డపై మరోసారి గెలిపిద్దామా? అంటూ అక్కడి జనమంతా చర్చ చేసుకోవడం గమనార్హం!

సాగర్​ వనపర్తి,
9494041258,
పొలిటికల్​ అనలిస్టు

ANN TOP 10