AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్.. 7 గంటలకు పోలింగ్ శాతం ఎంతంటే?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 102 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. రాత్రి 7 గంటల సమయానికి 60.03 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

కాగా తమిళనాడు (39), రాజస్థాన్‌ (12), ఉత్తరప్రదేశ్‌ (8), మధ్యప్రదేశ్‌ (6), ఉత్తరాఖండ్‌ (5), అరుణాచల్‌ ప్రదేశ్‌ (2), మేఘాలయ (2) రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకు తొలి దశతో ఎన్నికలు పూర్తయ్యాయి. అండమాన్-నికోబార్ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1), లక్షద్వీప్ (1) సీట్లకు కూడా పూర్తయ్యాయి. ఇక అసోం, మహారాష్ట్రలో 5 సీట్లు, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూ కశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కో సీటుకు శుక్రవారం పోలింగ్ జరిగింది.

ANN TOP 10