AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అధికారంలో లేని కేసీఆర్ గేమ్ ఆడితే.. రేవంత్ రెడ్డి సైలెంట్‌గా ఉంటారా?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బయటకు వస్తే తమ అస్త్రాలు బయటకు తీస్తామని అన్నారు. తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయన మాటలకు తాము అగస్టులో సమాధానం చెబుతామన్నారు. అసలు ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో ఉన్నారో త్వరలో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏం చేసినా తమ ప్రభుత్వానికి ఏమీ కాదని చెప్పారు. అధికారంలో లేని కేసీఆర్ గేమ్ ఆడితే.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ఆడకుండా ఉంటారా అని అన్నారు. కేసీఆర్ ఏ ఆలోచనతో ప్రభుత్వం కూలిపోతుందని తనకే తెలియదని, ఆయన ఆలోచన తిప్పి కొట్టే వ్యూహం ఉందని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్‌లో ముగ్గురు, బీజేపీలో ఇద్దరు మాత్రమే లీడర్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కానీ తమ పార్టీలో లీడర్లకు కొదవ లేదన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేణుకా చౌదరి, జీవన్ రెడ్డి, వీహెచ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఇలా తమ పార్టీలో అందరూ తోపులు బ్రిలియంట్స్ ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని జగ్గారెడ్డి విమర్శించారు.

ANN TOP 10