AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాకు ఊపిరి పోయిన గడ్డ పాలమూరు.. సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మెట్టుగడ్డ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీ సహా ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్యేలు కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లారు. నామినేషన్ సందర్భంగా ర్యాలీలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్‌తో దుమ్మరేపారు. ఈ క్రమంలోనే అక్కడ జనసందోహాన్ని తలపించింది. పాలమూరులో పాంచజన్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాకు ఊపిరి పోసిన గడ్డ పాలమూరు గడ్డ అని భావోద్వేగ ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘పాలమూరులో పాంచజన్యం. నాకు ఊపిరి పోసిన గడ్డ పాలమూరు. నేను పెరిగి ఎదిగిన ప్రాంతం మహబూబునగర్. అసెంబ్లీలో నిన్న ఎగిరిన జెండా.. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రెపరెపలాడాలి. నేడు నామినేషన్ సందర్భంగా పూరించిన పాంచజన్యం.. చేరాలి గెలుపు తీరం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ANN TOP 10