AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లో చేరిన కేటీఆర్‌ బామ్మర్ది

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీలోని నేతలు వరుసగా కాంగ్రెస్‌లోకి జంప్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఊహించని షాక్‌ తగిలింది. కేటీఆర్‌ బావమరిది ఎడ్ల రాహుల్‌ రావు కాంగ్రెస్‌లో చేరారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సతీమణి దూరపు బంధువు, కేటీఆర్‌కు వరుసకు బావమరిది అయిన ఎడ్ల రాహుల్‌రావు కాంగ్రెస్‌ తీర్థం పుచుకున్నారు. శుక్రవారం మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్‌రావుకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ANN TOP 10