(అమ్మన్యూస్, అమరావతి):
వైఎస్ విజయమ్మ పుట్టినరోజున వైఎస్ షర్మిల పెట్టిన పోస్ట్ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల రెడ్డి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న సమరం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. అన్నాచెల్లెళ్ల మధ్య జరుగుతున్న సమరం నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ఇద్దరికీ చెప్పలేక యూఎస్ బాట పట్టిన విషయం తెలిసిందే. వైఎస్ విజయమ్మ మద్దతు తమకంటే తమకుందని అన్నా చెల్లెలు ఇద్దరు పోటీపడి మరి జనాలకు చూపించే ప్రయత్నం చేశారు.
విజయమ్మ పుట్టినరోజున షర్మిల మరో మారు ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈరోజు వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టిన వైఎస్ షర్మిల నాకు జన్మనిచ్చి, ఆ జన్మకు సార్ధకత చేకూర్చుకోవడానికి అండగా ఉన్నావు అంటూ తల్లిని కొనియాడారు. విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపము నువ్వు అంటూ తల్లి విజయమ్మ తమకు అండగా ఉన్న కొండంత ధైర్యం అన్నారు. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనశ్శాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ హ్యాపీ బర్త్డే మా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఎన్నికల వేళ విజయమ్మ కోసం ఆసక్తికర పోస్ట్ విజయమ్మ పుట్టినరోజున వైఎస్ షర్మిల పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.