AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్‌.. కడియం శ్రీహరిపై రాజయ్య సంచలన కామెంట్స్‌

(అమ్మన్యూస్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌):
ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్‌ చేశారు. శుక్రవారం రాజయ్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..కడియం శ్రీహరికి సవాల్‌ విసిరారు. నీకు సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్‌ అంటూ కడియంపై తొడకొట్టి మరీ సవాల్‌ విసిరారు. ఉప ఎన్నికల్లో నువ్వా? నేనా? చూసుకుందామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతిమపోరాటం మన ఇద్దరి మధ్యనేనని అన్నారు. దేశం మొత్తం అక్కడ రాజయ్య గెలుస్తాడా? లేక కడియం శ్రీహరి గెలుస్తాడా? అని మన ఇద్దరి కోసమే ఎదురుచూస్తున్నారంటూ రాజయ్య.. కడియంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఇటీవల రాజయ్య మీడియాతో మాట్లాడుతూ కడియం ఓ నరరూప రాక్షసుడని, నమ్మకద్రోహి. కడియం ను మేధావి అన్నవాళ్లే ఇప్పుడు చెంపలేసుకుంటున్నారని మండిపడ్డ విషయం తెలిసిందే. తనలాంటి అమాయకుడిపై అక్రమ కేసులు బనాయించారని రాజయ్య ఫైర్‌ అయ్యారు. కడియం శ్రీహరి అవినీతి సామ్రాట్‌ అన్నారు. మాదిగ జాతి ఆయనపై తూ.. అని ఊస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ANN TOP 10