సీఎం రేవంత్ సమక్షంలో చేరిక
(అమ్మన్యూస్, హైదరాబాద్):
కాంగ్రెస్‌లోకి చేరికల జోరు కొనసాగుతూనే ఉంది. చేరికలు రాజకీయ ఉత్కంఠను రేపుతున్నాయి. ఓవైపు లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరో వైపు నేతల జంపింగులు అంతే స్థాయిలో కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎంపీ డి.రవీంద్ర నాయక్ కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి ఏపీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా, 2004లో వరంగల్ ఎంపీగా పని చేసిన ఆయన.. బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అనంతరం 2019లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. గత నెలలో బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. బంజారా కమిషన్ ఏర్పాటు పట్ల బీజేపీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని, బీజేపీలో ఉన్న సీనియర్ లంబాడి నాయకుడిని తానేనని, అయినా ఏ విషయంలోనూ బీజేపీ నేతలు తనను సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.









