AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాలేజీ క్యాంప‌స్‌లో యువ‌తిని అతి దారుణంగా పొడిచి చంపేసిన యువకుడు..

క‌ర్ణాట‌క హుబ్బ‌ళ్లిలో దారుణం జ‌రిగింది. కాంగ్రెస్ కార్పొరేట‌ర్ నిరంజ‌న్ కుమార్తె నేహా హిరేమ‌త్‌ను కాలేజీ క్యాంప‌స్‌లోనే ఫ‌యాజ్ అనే యువ‌కుడు అతి కిరాత‌కంగా పొడిచి చంపేశాడు. ఈ ఘ‌ట‌న తాలూకు దృశ్యాలు అక్క‌డి సీసీటీవీలో రికార్డ‌య్యాయి. ఈ వీడియో కాస్తా బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది.

పోలీసులు ఫ‌యాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించ‌గా.. బీసీఏ కోర్సు స‌మ‌యంలో వీరిద్ద‌రూ క‌లిసి చ‌దువుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. తామిద్ద‌రం ప్రేమించుకున్న‌ట్లు నిందితుడు తెలిపాడు. కానీ, కొన్ని రోజులుగా ఉన్న‌ట్టుండి ఆమె త‌న‌ను దూరం పెడుతుండ‌టంతోనే హ‌త్య చేశాన‌ని ఫ‌యాజ్ అంగీక‌రించాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

ANN TOP 10