AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అధికార పార్టీ కనుసైగల్లో కబ్జాలు.. ఖాళీ భూమి కనిపిస్తే అంతే?

అమ్మన్యూస్, పినపాక : మండలంలోని భూములు ఖాళీగా కనపడితే చాలు అంతా మాదే అంటూ, కబ్జాలకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. భూ కబ్జాదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అండగా నిలుస్తూ, అసలు భూ యజమానులను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మండలంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఈసం భవతి తన ఇంటి పక్కన ఉన్న ఐదు సెంట్ల భూమి తనదే అంటూ భూ కబ్జాకు పాల్పడింది. ఆ గ్రామానికి చెందిన సోయం విష్ణుమూర్తి, తన తాతల కాలం నాటి భూమి కావడంతో తనకు సంక్రమిస్తూ వస్తుంది. తన తాతల కాలంలో వేల ఎకరాల భూమిని ఊరు అభివృద్ధి కోసం ఎంతోమందికి దానం దత్తం చేశారని తెలిపారు. ఈసం భవతి ఇంటి పక్కన ఐదు సెంట్ల భూమిని, కబ్జా చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులపై కూడా భౌతికంగా దాడులకు దిగుతుందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా తన సొంత భూమి కోసం ఈసం భవతి, కొంతమంది కాంగ్రెస్ నాయకుల అండ దండలు చూసుకొని రెచ్చిపోతున్నారని అన్నారు. ఈ విషయంపై పినపాక తాసిల్దార్‌కు ఫిర్యాదు చేయగా.. విచారణకు వస్తానని ఆ భూమి మీదకి ఎవరు వెళ్లొద్దని సూచించారు. మాజీ సర్పంచ్ అధికారులు లేని సమయంలో ట్రాక్టర్ల ద్వారా మట్టి పోసేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లారు.

ఈ తరుణంలోనే తన కుటుంబ సభ్యుల పై దాడులకు దిగడమే కాకుండా.. బూతులు తిడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ ఈసం భవతి కాంగ్రెస్ పార్టీకి చెందిన బుల్ రెడ్డి అనే నాయకుడికి తెలపడంతో అ ప్రదేశానికి వచ్చి పరిశీలించి మీరు స్టేషన్‌లో కేసు పెట్టండి.. నేను చూసుకుంటాను అంటూ అండగా నిలిచారని వాపోయారు. అంతేకాకుండా బుధవారం తన మహిళ బంధువు పై బూతులు తిడుతూ దౌర్జన్యంగా భౌతిక దాడికి దిగారని, వస్త్రాలను సైతం చించి వేసిందని తెలిపారు. తోటి మహిళ అని చూడకుండా వస్త్రాలను చించడం ఎంతవరకు సబబు కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అండదండలతోనే ఈ తతంగం అంత చేస్తుందని అన్నారు. ప్రజా పాలనలో రాక్షస పాలన జరుగుతుందని ప్రజలు ప్రశాంతంగా బతికేటట్లు లేరని వాపోయారు. ఆ భూమికి సంబంధించిన అన్ని హక్కులు నాకే ఉన్న ఆ కాంగ్రెస్ నాయకుడు మాత్రం ఎమ్మెల్యే పేరు చెబుతూ, భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసని అంటున్నారు. ఆ కాంగ్రెస్ నాయకుడైన బుల్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే తన నైజాన్ని ప్రదర్శిస్తున్నాడని తెలిపారు. మాజీ సర్పంచ్ ఈసం భవతి గ్రామంలో మరి కోన్ని చోట్ల భూ కబ్జాలు చేసిందని వాపోతున్నాడు. మరి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే నిరుంకశ పాలన చేయడం, కాంగ్రెస్ నాయకులు అడ్డు అదుపు లేకుండా పోతుందని విమర్శిస్తున్నారు.

ANN TOP 10