ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడి కేసులో నిందితుడు సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిమిత్తం అతన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత విజయవాడ కోర్టులో నిందితుడు సతీష్‌ను పోలీసులు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో జగన్ దాడి కేసులో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడిలో సతీష్ ఏ1 నిందితుడిగా ఉన్నాడు. ఈ నెల 13న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏపీ సీఎం జగన్ చేపట్టిన వైసీపీ మేమంతా సిద్దం బస్సు యాత్ర కొనసాగుతుండగా ఆయనపై రాయితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక ఉన్న వారిని గుర్తించిన పోలీసులు విచారణ అనంతరం అరెస్టు చేశారు. జగన్‌పై దాడికి నిందితుడు సతీష్ కారణమని నిర్దారణకు వచ్చిన తర్వాత పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.