AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపటి నుంచే రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్‌ ఇదే..

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్‌ నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. శనివారం మెదక్‌ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.

శనివారం సాయంత్రం కర్ణాటకలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రచారం చేయనున్నారు. 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. 22వతేదీ ఉదయం ఆదిలాబాద్‌లో నిర్వహించే కాంగ్రెస్‌ సభలో రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. 23న నాగర్‌ కర్నూల్‌ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 24వ తేదీ ఉదయం జహీరాబాద్‌, సాయంత్రం వరంగల్‌లో నిర్వహించే సభల్లో రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.

కాగా లోక్‌సభ ఎన్నికలకు అసలైన ఘట్టం మొదలైంది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. ఇప్పటికే ప్రచారంలో ముందున్న పార్టీలు, అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఇందుకు రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఆర్వో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది.

ANN TOP 10