భారత దేశ జనాభా 144 కోట్లకు చేరిందని అంచనా. ఇందులో 24శాతం మంది 0-14 సంవత్సరాల వయుసున్న ఉన్నారు. ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) నివేదిక పేర్కొంది. అయితే, 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లు. అయితే, ప్రసవ సమయంలో శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయని నివేదిక వెల్లడించింది. భారతదేశ జనాభాలో 24 శాతం మంది 0-14 సంవత్సరాల మధ్య వయస్కులు కాగా.. 17శాతం మంది 10-19 సంవత్సరాల మధ్య వయస్కులున్నారు. జనాభాలో 68 శాతం మంది 10-24 ఏళ్ల మధ్య వయస్కులు కాగా, 7 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
పురుషుల ఆయురార్దం 71 సంవత్సరాలు కాగా.. మహిళల ఆయుర్దాయం 74 సంవత్సరాలు. 2006 నుంచి 2023 మధ్య భారత్‌లో బాల్య వివాహాల శాతం 23శాతంగా ఉందని పేర్కొంది. ఇక దేశంలో డెలివరీ సమయంలో మరణాలు తగ్గుముఖం పట్టాయి. పీఎల్‌ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ నివేదికను ఉదహరిస్తూ.. 640 జిల్లాల్లో ప్రసవానంతర మరణాల నిష్పత్తి లక్ష జననాల్లో 70 కంటే తక్కువగా ఉంది. 114 జిల్లాల్లో ఈ నిష్పత్తి 210 కంటే ఎక్కువగా ఉంది. వికలాంగులు, శరణార్థులు, జాతి మైనారిటీలు, క్వీర్ కమ్యూనిటీలు, హెచ్‌ఐవీతో బాధితులతో పాటు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు, బాలికలు అత్యధిక లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వేదిక పేర్కొంది.