రామ మందిరానికి పోటెత్తిన భక్తులు
అయోధ్య రామ మందిరంలో చోటుచేసుకున్న అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ట్రస్టు బాల రాముడికి సూర్యాభిషేకాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దూరదర్శన్ సహకారంతో లైవ్ ఏర్పాట్లు చేసింది. ఏటా రామనవమి రోజు బాలక్ రామ్ విగ్రహాన్ని సూర్య కిరణాలు ముద్దాడనున్నాయి.









