అమెరికాలో అత్యంత ప్రతిష్టత్మకంగా నిర్వహించే అమెరికన్ తెలుగు అసోసియేషన్ ద్వివార్షిక మహాసభలకు.. రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది. అమెరికాలోని అట్లాంటలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో నిర్వహించే ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆటా ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ మేరకు ఆట కన్వినర్ పాశం కిరణ్ రెడ్డి ఆహ్వాన లేఖను మంత్రికి అందించారు.
జూన్ 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు అట్లాంట నగరంలో నిర్వహించే ఈ ఆటా వేడుకల్లో అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భారతీయులు, చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యువత కోసం జాబ్ ఫెయిర్స్, ఎడ్యూకేషన్ సమ్మిట్స్, హెల్త్ క్యాంప్స్ తో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల్లో.. డిజిటల్ క్లాస్ రూం ల ఏర్పాటు, సానిటేషన్ వంటి మౌళిక వసతులు కల్పించేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు ఆటా ప్రతినిధులు. ఈమేరకు ఆటా తరుఫున చేపడుతున్న కార్యక్రమాలను మంత్రికి వివరించారు ప్రతినిధులు. విశాలమైన అమెరికా దేశంలో ఆటా వేదికగా తెలుగు భాష మాట్లాడేవారందరిని ఒక్కటిగా కలిపి ఉంచడంతోపాటు, తెలుగు భాషను, సంస్కృతిని పెంపొందిస్తున్నామని మంత్రికి లేఖలో వివరించారు.