AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమే’

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. ముఖ్యమైన మార్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అంటూ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలతో బీజేపీలోకి వెళ్తాడుంటూ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆదిలాబాద్ ఎన్నికల పార్లమెంట్ సన్నాహాక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రాహూల్ గాంధీ మనిశా, మోడీ మనిశా ఆలోచించండన్నారు. దమ్ముంటే మీ కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటు కాంగ్రెస్ కు వేసిన అది బీజేపీకి పోతది అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు.

ఆదిలాబాద్ అభ్యర్థిని నాలుగు నెలల ముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారన్నారు. ఆత్రం సక్కు లాంటి సీనియర్ నాయకుడు పార్లమెంట్ ఉండాలన్నారు. అధికారం పోగానే కొందరు తమ దారులు వెతుక్కుంటూ వెళ్లిపోయారని మండిపడ్డారు. మంత్రి పదవులు అనుభవించిన వాళ్లు కూడా పార్టీ నుంచి జారుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆదివాసీ బిడ్డ ఆత్రం సక్కు కష్టాల్లోనూ పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 120 రోజులైందని, అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారని, వాళ్లు 420 హామీలు ఇచ్చారని అన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని డైలాగ్‌లు కొట్టారని కామెంట్స్ చేశారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడని, పంద్రాగస్టు వరకు పూర్తి చేస్తామని ఇప్పుడు అంటున్నాడని కేటీఆర్ అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10