AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కడియం కాస్కో.. ఇక కబడ్డీ ఆడుడే.. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి తాటికొండ రాజయ్య

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. వరంగల్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బిడ్డా కాస్కో.. ఇక మధ్య కబడ్డీ.. కబడ్డే.. తగ్గేదే లే అంటూ సవాల్‌ విసిరారు. దమ్ముంటే రా.. స్టేషన్‌ ఘనపూర్‌లో నువ్వు చేసిన అభివృద్ధి.. నేను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. విదేశాల్లో కడియం శ్రీహరికి ఆస్తులున్నాయని.. ఆ అక్రమ ఆస్తులకు కావ్య, ఆమె భర్త నజీర్‌ బినామీలుగా ఉన్నారన్నారు.

ఇక్కడ దోచుకున్న డబ్బులతో మలేషియా, సింగ్‌పూర్‌లో అక్రమాస్తులు కూడబెట్టారన్నారు. హవాలా రూపంలో డబ్బు విదేశాలకు తరలించారని ఆరోపించారు. తనకు లొంగనివాళ్లను ఎన్‌ కౌంటర్‌ చేయించిన దుర్మార్గుడు కడియం అంటూ మండిపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు డీఈఓల బదిలీల్లో రూ.2కోట్లు, లింగంపల్లి ప్రాజెక్ట్‌ కాంట్రాక్టర్‌ వద్ద రూ.6 కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. పేకాట ఆడుతూ దొరికితే పోలీస్‌ స్టేషన్‌లో కూర్చో బెట్టలేదా? సోషల్‌ వెల్ఫేర్‌ మంత్రిగా ఉండి అమాయక పిల్లల పొట్టకొట్టి కోట్లు దోచుకున్న చరిత్ర కడియం శ్రీహరిదని విమర్శించారు. నాలుగుసార్లు ఓడిపోయిన కడియం శ్రీహరి తన గురించి మాట్లాడడానికి సిగ్గులేదా? అంటూ విమర్శించారు. నవ్వు ఎక్కడ పుట్టినవ్‌? ఎక్కడ పెరిగినవ్‌..? జీవిత చరిత్ర మొత్తం త్వరలోనే బయటపెడతానని రాజయ్య అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10