ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జహీర్ రంజానీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జహీర్ రంజానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆయన కూడా హస్తం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ ప్రకటించారు.
