AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన రాథోడ్ బాపురావు

లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీకి షాక్ ఇచ్చారు. సోమవారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు రాథోడ్ బాపురావు. అయితే 2023 వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపురావు.. టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లి అక్కడ కూడా టికెట్ రాకపోవడంతో వెనువెంటనే బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో 53,992 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు తిరిగి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి సీతక్క ఈ చేరికలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు ఉన్నారు. అలాగే నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జీ ఈశ్వర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ కూడా సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి త్వరలో కాంగ్రెస్‌లో చేరుతానని ఆయన ప్రకటించారు.

ANN TOP 10