AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి రెడీ

మీడియా మొఘల్‌గా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియన్‌-అమెరికన్‌ వ్యాపారవేత్త రూపర్ట్‌ మర్దోక్‌ (Rupert Murdoch) మరోసారి పెళ్లికి (Marriage) సిద్ధమయ్యారు. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని నలుగురికీ విడాకులిచ్చిన ఆయన.. తన ప్రియురాలు ఆన్‌ లెస్లీ స్మిత్‌ను ఐదో వివాహం చేసుకున్నారు. ఇరువురికీ ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు రూపర్ట్ మర్దోక్ ప్రకటించారు. ఆయన వయసు 92 ఏళ్ల కాగా… ఈ వయసులోనూ పెళ్లిపీటలు ఎక్కడం గమనార్హం. అయితే, ఇదే చివరి వివాహమని పేర్కొన్నారు. ఏడు నెలల కిందటే నాలుగో భార్య జెర్రీ హాల్‌ నుంచి మార్దోక్ విడాకులు తీసుకుని.. ఐదోసారి పెళ్లి కొడుకు అవుతున్నారు.

నాలుగో భార్య జెర్రీ హాల్‌, రూపర్ట్ మర్దోక్‌లు గతేడాది ఆగస్టులోనే విడాకులు తీసుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు మళ్లీ ఆన్ లెస్లీ స్మిత్ అనే 66 ఏళ్ల మాజీ పోలీస్ అధికారిణితో ప్రేమలో పడిన ఆయన.. ప్రియురాలి ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మార్చి 17న న్యూయార్క్‌లో రూపక్ మర్దోక్, ఆన్ లెస్లీల ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆ సందర్భంగా ప్రియురాలి చేతికి ఉంగరం తొడిగిన మర్దోక్‌.. ‘నేను ప్రేమలో పడటానికి భయపడ్డాను. కానీ, నాకు తెలుసు ఇదే నా చివరి వివాహం అని. బాగుంటుందని ఆశిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని మర్దోక్‌ చెప్పినట్లు పేర్కొంది.

ANN TOP 10