మంత్రి కొండా సంచలన వ్యాఖ్యలు
మెదక్‌లో కాంగ్రెస్ సమావేశం..
రైతుల పంటలు ఎండిపోవడానికి కారణం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెదక్ పార్లమెంట్ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రైతుల పంటలు పండుతున్నాయంటే కారణం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టుతోనే అన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం వాళ్ల కుటుంబం, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల కోసమే పని చేసిందన్నారు. ప్రభుత్వ పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రజల వద్దకు వస్తున్నారని, ఆయన మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసి తీరుతుందన్నారు.