AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్‌ జైలు కెళ్లడం ఖాయం.. ఆస్ట్రాలజర్‌ వేణు స్వామి సెన్సేషనల్‌ కామెంట్స్‌

ఆ ముగ్గురికి సమస్యలు తప్పవు.. ఆస్ట్రాలజర్‌ వేణు స్వామి
సోషల్‌ మీడియాలో జోరుగా చక్కర్లు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ప్రముఖ ఆస్ట్రాలజర్‌ వేణు స్వామి.. సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు. అవి సామాజిక మాధ్యమాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. వేణు స్వామి.. రాజకీయ, సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ నెట్టింట సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పలువురు హీరోయిన్ల జాతకాలు చెప్పి పరిహార పూజలు కూడా చేశారు. అయితే వేణు స్వామి చెప్పే ప్రతి కామెంట్స్‌ నిమిషాల్లో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంటాయి. అలాగే ఒక్కోసారి విమర్శలు కూడా ఎదుర్కొంటాడు. అయినప్పటికీ సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేస్తూ నిత్యం రచ్చ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా వేణు స్వామికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, కూతురు కవిత, కొడుకు కేటీఆర్‌ ముగ్గురికి సమస్యలు వస్తాయని చెప్పిన అలాగే జరుగుతుంది. ఈ ముగ్గురు ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేస్తున్నారు. ఆయన పార్టీ పరంగా చేస్తున్నాడు. కూతురు జైలుకు వెళ్లింది. కొడుకు కూడా తొందరలోనే జైలుకు పోబోతున్నారు. 2023 నుంచి రెండున్నర సంవత్సరాల పాటు న్యాయపరమైన చిక్కులుంటాయి. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. 2023లోనే కేసీఆర్‌ తుంటి ఎముక విరిగింది. అంతేకాకుండా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.

2024లో కేసీఆర్‌ కూతురు జైలుకు పోయింది. ఈ క్రమంలోనే ఆయన కొడుకు కేటీఆర్‌ జైలుకు పోతాడు. సో ఇవన్నీ జరిగినయ్‌ కదా. పార్టీలో ఉన్న జనాలు కూడా పోయారు. నేను చెప్పినట్టే ముగ్గురికి సమస్యలు వస్తున్నాయి కదా చెప్పినట్లే జరుగుతుంది కాబట్టి కేటీఆర్‌ విషయంలో కూడా నేను అన్నదే జరుగుతుంది. నేనేదో ఊరికే చెప్పలేదు. వారి జాతకం చూసి విశ్లేషణలు చేసుకుని చెప్పాను‘ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణు స్వామికి సంబంధించిన వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

ANN TOP 10