AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలైన విషాద ఘట్టన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. నిశ్చితార్థ వేడుకకు బస్సులో మొత్తం 62 బయలుదేరారు. ఈ క్రమంలో కిక్కిరిసిన బస్సును పసులి గ్రామం వద్దకు రాగానే ఓ వ్యాన్‌ ఢీకొట్టింది. అనంతరం బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న మట్టి గనిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది నుజ్జునుజ్జె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 40 మందికి గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాజ్‌నంద్‌గావ్‌లోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారని రాయ్‌పూర్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయ అధికారులు తెలిపారు. అందులో తీవ్రంగా గాయపడిన వారిని దుర్గ్‌లోని భిలాయ్‌ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా విషయం తెలిసి దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ANN TOP 10