AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌కు ప్రమాద ఘంటికలు.. సరిగ్గా ఏడాది క్రితమే చెప్పినా..

‘సొంత వర్గం నేతల నుంచే కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయంలో రాజు జాగ్రత్తగా ఉండాలి’… ఇదీ సరిగ్గా ఏడాది క్రితం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన శోభకృత్‌ ఉగాది(Ugadi) వేడుకల సందర్భంగా పంచాగకర్త, వేదపండితుడు సంతోష్‌ కుమార్‌ శాస్త్రి అప్పటి సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన సూచన ఇది! కేసీఆర్‌కు ఆ ఏడాదంతా శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయని, రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకరమైన ఘటనలూ చోటు చేసుకుంటాయని అప్పట్లో పంచాంగకర్త చెప్పారు. అప్పటికి.. రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయి ఎన్నికల హడావుడి మొదలవుతున్న వేళ కేసీఆర్‌ను ఉద్దేశించి పంచాంగ కర్త చేసిన వ్యాఖ్యలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.

పంచాంగకర్త చెప్పింది చెప్పినట్లే జరిగిందా? అని చర్చించుకుంటున్నారు. 2023 నవంబరు- డిసెంబరులో రాజకీయాల్లో ఆశ్చకరమైన ఘటనలు చోటుచేసుకుంటాయని అప్పట్లో పంచాంగ పఠనం సందర్భంగా సంతోష్‌ కుమార్‌ శాస్త్రి చెప్పారు. ఈ క్రమంలో.. నిరుడు నవంబరులో ఎన్నికలు జరగడం… డిసెంబరులో వెలువడ్డ ఫలితాల్లో అధికార బీఆర్‌ఎస్‌ ఓటమిపాలవ్వడాన్ని గుర్తుచేసుకుంటున్నారు. సొంత వర్గం నుంచే కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే అవకాశం ఉందంటూ పంచాగకర్త చేసిన వ్యాఖ్యల నేపథ్యలో కొన్నాళ్లుగా బీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పార్టీల్లోకి జరుగుతున్న నేతల వలసలను గుర్తుచేసుకుంటున్నారు!

ANN TOP 10