జగిత్యాల జిల్లాలో నేడు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను పరామర్శనున్నారు. కాగా, ఇటీవల ఎమ్మెల్యే తండ్రి, ప్రముఖ న్యాయవాది హనుమంతరావు (85) అనారోగ్యంతో మృతి చెందాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమంతరావు న్యాయవాదిగా పనిచేశారు. ఎంతోమంది పేదలకు న్యాయ సహాయం అందించారు.
