చేరికలకు రంగం సిద్ధం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
మెదక్ లోక్‌సభ నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. గెలిచి తీరేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం రంగంలోకి నాయకులకు,కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక్కడ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిథ్యం వహించడం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా కావడంతో ఈ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా చేరికలపై దృష్టిపెట్టింది. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పలువురు ముఖ్యులతో జరిపిన మంతనాలు సఫలమయ్యాయని, త్వరలో వీరు కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున నీలం మధు పోటీ చేస్తున్న విషయం విదితమే. తుక్కుగూడలో జరిగిన జనజాతర సభ సక్సెస్ లో కలిసికట్టుగా ముందుకు కదిలి మెదక్ పార్లమెంటు తరపున జన సమీకరణ చేసి విజయవంతం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీలం మధును అభినందించారు.
సభను విజయవంతం చేసిన స్పూర్తితో ప్రజలలోకి వెళ్లాలని సూచించారు. అందరి నాయకులతో ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.