AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నెరవేరిన మంత్రి పొంగులేటి పంతం.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్..

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. బిఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో 10 కి కాంగ్రెస్ 8, సీపీఐ 1, బి ఆర్ ఎస్ 1 గెలుచుకున్నాయి. కొద్దిరోజులుగా కాంగ్రెస్‎కి దగ్గరగా ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్ గూటికి చేయడంతో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ‎కి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎన్నికల ముందు ఒక్క బిఆర్ఎస్ లీడర్‎ను అసెంబ్లీ గేట్ తాకనీయనని మంత్రి పొంగులేటి చేసిన శపథం నేర వేరింది. ఓటమి తర్వాత ముఖ్య నేతలు బయటకు రావడం లేదు. జిల్లాలో అసలు బిఆర్ఎస్ పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది.

భద్రాచలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా తెల్లం వెంకటరావు విజయం సాధించారు. జిల్లాలో బిఆర్ఎస్ గెలిచిన ఏకైక స్థానం ఇదే. వాస్తవానికి తెల్లం వెంకటరావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడు. పొంగులేటితో పాటే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత భద్రాచలం టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్యకి ఇవ్వడంతో బిఆర్ఎస్‎లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. స్వల్ప మెజారిటీతో అనూహ్యంగా విజయం సాధించారు తెల్లం వెంకటరావు. పలితాలు తర్వాత కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినా.. అప్పట్లో తెల్లం వెంకటరావు ఆ ప్రచారాన్ని ఖండించారు.

ఆ తర్వాత కొద్ది రోజులకు కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్‎ను కలిశారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభోత్సవం, అదే రోజు మణుగూరు కాంగ్రెస్ బహిరంగ సభలో తెల్లం వెంకటరావు పాల్గొనడంతో ఆయన కాంగ్రెస్‎లో చేరడం ఖాయమని అంతా అనుకున్నారు. బిఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ సమావేశాలు, సభలకు హాజరవుతూ వచ్చారు. అయితే ఆదివారం సీఎం రేవంత్ సమక్షంలో మంత్రి పొంగులేటి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకున్నది సాధించారు అని జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ కాక రేపాయి. రాష్ట్రంలోనే అధికార బిఆర్ఎస్‎లో ఉంటూ తిరుగుబాటు బావుటా ఎగురవేసి.. కేసిఆర్‎తోపాటు ఇతర నేతలపై విమర్శలు సంధించారు పొంగులేటి. జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు పెడుతూ కాక పుట్టించారు. తనకు బిఆర్ఎస్ చేసిన అవమానం, ఇబ్బందులు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళారు. బిఆర్ఎస్ ప్రభుత్వంను ఓడించి.. కెసిఆర్‎ను గద్దె దించడమే తన లక్ష్యం అని గట్టిగా సవాల్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10