AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుజరాత్‌‌ చిత్తు.. లక్నో హ్యాట్రిక్ విజయం.. ముచ్చటగా మూడోసారి..!

ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం (ఏప్రిల్ 7న) లక్నోలోని ఎక్నా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్ అదరగొట్టింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది. సొంతగడ్డపై లక్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌‌తో గుజరాత్‌ను చిత్తు చేసింది. 33 పరుగుల తేడాతో గుజరాత్ పరాజయం పాలైంది. లక్నో నిర్దేశించిన 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన గుజరాత్ టైటాన్స్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం 130 పరుగులకే చేతులేత్తేసింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో గుజరాత్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది.

సాయి సుదర్శన్‌దే టాప్ స్కోర్ :
బ్యాటింగ్‌లో తడబడిన గుజరాత్ ఆటగాళ్లు ఎవరూ గట్టిపోరాటం ఇవ్వలేదు. సాయి సుదర్శన్ 23 బంతుల్లో 31 పరుగులతో పర్వాలేదనిపించగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ 5 బంతుల్లో (1), బీఆర్ శరత్ 5 బంతుల్లో (2), విజయ్ శంకర్ 17 బంతుల్లో (17), దర్శన్ నెల్కండే 11 బంతుల్లో (12) పరుగులు, రషీద్ ఖాన్ 3 బంతులు ఆడి ఖాతా కూడా తెరవలేదు. ఉమేష్ యాదవ్ 4 బంతుల్లో (2), నూర్ అహ్మద్ (4) పరుగులు చేసి ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. దాంతో లక్నో బౌలర్‌కు గుజరాత్ ఏ ఆటగాడు బ్యాట్‌తో సమాధానం చెప్పలేకపోయారు.

యశ్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ :
లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, యశ్ ఠాకూర్ కూడా 3.5 ఓవర్లలో 30 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీసుకున్నాడు. రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీశారు. లక్నో మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించిన బౌలర్ యశ్ ఠాకూర్ (5/30)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10