AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ ఓ మహా సముద్రం.. తుక్కుగూడ సభ సక్సెస్‌పై సీఎం ట్వీట్

తుక్కుగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి పవర్ ఫుల్ స్పీచ్‌తో అదరగొట్టారు. తనదైన శైలిలో మాట్లాడి కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహన్ని నింపారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ జనసంద్రాన్ని తలపించింది. జనజాతర సభకు వచ్చిన స్పందనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ పెట్టారు.

‘తుక్కుగూడలో కాంగ్రెస్ కెరటాలు పోటెత్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. సభకు తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్.. ఓ మహా సముద్రం. అందులో మా కార్యకర్తలు, నీటి బిందువులు కాదు.. పేదల బందువులు, మా కార్యకర్తలు.. పోటెత్తె కెరటాలు, పోరాడే సైనికులని అన్నారు. మా కార్యకర్తలు.. త్యాగశీలులు.. తెగించి కొట్లాడే వీరులని కొనియాడారు. మా కార్యకర్తలు… జెండా మోసే బోయీలు మాత్రమే కాదు.. ఎజెండాలు నిర్ణయించే నాయకులు. నిన్నటి తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది.. చేసిన శబ్ధమిదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ANN TOP 10