నేడు ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు మధ్య మ్యాచ్ జరగబోతుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా సాయంత్రం 7: 30 గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. వరస ఓటములతో నిరాశలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచి ఐపీఎల్ రేసులో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు ఓ విశేషం ఉంది. రాజస్థాన్ తమ రెగ్యులర్ జెర్సీతో కాకుండా పూర్తి పింక్ కలర్ జెర్సీతో మ్యాచ్ ఆడనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాజస్థాన్ రాయల్స్ తెలియజేసింది. వాస్తవానికి రాజస్థాన్ జెర్సీ కలర్ కూడా పింక్ కలరే. అయితే.. పింక్‌తో పాటు కొన్ని రంగులు కలిసి ఉంటాయి. కానీ నేటి మ్యాచ్ కోసం మాత్రం పూర్తి పింక్ కలర్ జెర్సీని ధరించనుంది. దానికి కారణం ఏమిటంటే.. #PinkPromise మిషన్ కింద రాజస్థాన్ ఆడుతున్న మ్యాచ్ ఇది. మహిళల సాధికారత ఈ మిషన్ లక్ష్యం. మహిళల అభ్యున్నతికి కోసం అంకితం చేశారు.
ఇందులో భాగంగా ఈ మ్యాచ్‌కు విక్రయించే ప్రతి టికెట్ నుంచి రూ.100 మహిళల అభివృద్ధికి విరాళంగా ఇవ్వనున్నారు. అంతేకాదండోయ్ ఈ మ్యాచ్‌లో కొట్టే ఒక్కో సిక్స్ ద్వారా రాజస్థాన్‌లోని ఆరు ళ్లకు సౌరశక్తిని అందించనున్నారు. టికెట్లను విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్‌కు వెళ్లనుంది. కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తీసుకున్న నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









