AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై హరీష్ రావు రియాక్షన్ ఇదే!

కేసీఆర్‌పై మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రైతుల సమస్యల గురించి కేసీఆర్ మాట్లాడితే మంత్రులు ఆయనను తిడుతున్నారని.. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని అంటున్నారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిగ్గు ఉందా..రాహుల్ గాంధీ ఏమో తన మేనిఫెస్టోలో ఇతర పార్టీ వాళ్ళను పార్టీలోకి తీసుకోవద్దు అని పెడతారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. అటు ఉన్న సూర్యుడు ఇటు పొడిచినా కూడా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. మీరు ఎన్ని చేస్తారో చేయండి కానీ గుర్తు పెట్టుకొండి.. మేము వడ్డీతో సహా మీకు తిరిగి ఇస్తామని హెచ్చరించారు. మీరు ఎన్ని చేసినా ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు మిమ్మల్ని వదిలిపెట్టమని, మీ వెంట పడుతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం మెడ‌లు వంచి.. ఎన్నిక‌ల హామీలు అమ‌లు చేయిస్తామ‌ని జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గిందని విమర్శించారు. అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేశారని గుర్తు చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పడు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుంటున్నారు. వంద రోజుల తర్వాతే కోడ్ వచ్చింది. రూ. 2 లక్షల రుణమాఫీ, వడ్లకు, మక్కలకు రూ. 500 బోనస్, రూ. 4 వేల ఫించన్, రైతుబంధు రూ.15 వేలు, మహిళలకు రూ. 2500, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం, రూ. 4 వేల నిరుద్యోగ భృతి, ఆడపిల్లలకు ఉచిత స్కూటీ అందినవాళ్లే కాంగ్రెస్‌కు ఓటేయండన్నారు. అందనివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయండని హ‌రీశ్‌రావు సూచించారు.

ANN TOP 10