AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘టిల్లు’ బ్లౌజ్‌పైనే అందరి దృష్టి!

అనుపమ పరమేశ్వరన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ మంచి హిట్‌ అందుకుంటుంది. ఇక తాజాగా ఈ అమ్మడు టిల్లు స్క్వేర్‌ సినిమా సిద్ధు సరసన నటించి మెప్పించింది. మొదటి సారిగా రొమాంటిక్‌గా కనిపించి, లిల్లీ పాత్ర ద్వారా అందరినీ మాయచేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న సమయంలో అనుపమ పై విపరీతంగా ట్రోల్స్‌ వచ్చినా, మూవీ రిలీజైన తర్వాత అందరి నుంచి ప్రశంసలు అందుకుంటుంది ఈ బ్యూటీ.

అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య చీరకట్టుతో సోషల్‌ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. వివిధ రకాల సారీస్‌ కడుతూ. అందాలను ఆరబోస్తుంది. కాగా, తాజాగా ఈ బ్యూటీ నెట్టెడ్‌ శారీ, స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ తో అదిరిపోయే పోజులు ఇచ్చింది. కొంటె చూపుతో, చీరలో అందాల విందు ఇస్తుంది. ఇక ఫొటోస్‌ చూసిన కుర్రకారు అను అందానికి ఫిదా అయిపోతున్నారు. కానీ ఆమె బ్లౌజ్‌ గురించి ఎక్కువగా కామెంట్స్‌ పెడుతున్నారు. నీ బ్లౌజ్‌ అదిరిపోయిందని కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అనుపమ బాగా ట్రెండీగా మారిపోయింది.

ANN TOP 10