వ్యక్తిగత నిర్ణయమంటూ పిటిషన్ తిరస్కరణ
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
మధ్యం కుంభకోణంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. సీఎంగా కొనసాగాలా? వద్దా? అనేది కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయమని హైకోర్టు బెంచ్ గురువారం స్పష్టం చేసింది. ఈ విషయంపై రాజ్యాంగ అధికారుల్ని సంప్రదించాలని పిటిషనర్‌ను కోరింది. కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం అనేది జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలని, కానీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా? వద్దా? అనేది కేజ్రీవాల్ చేతిలోనే ఉందని హైకోర్టు పేర్కొంది. రాష్ట్రపతి పాలన లేదా గవర్నర్ పాలనని కోర్టు విధించిన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? అని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించింది.
కాగా.. జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ని సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా ఇటీవల ఢల్లీి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించడంతో.. గుప్తా తన పిటిషన్‌ను ఉపసంహరించుకుని, లెఫ్టినెంట్ గవర్నర్ ముందు ప్రెజెంట్ చేస్తానని చెప్పారు. మరోవైపు.. కేజ్రీవాల్‌ను మార్చి 21వ తేదీన అరెస్ట్ చేసిన తర్వాత దేశ రాజధాని ఢల్లీిలో ప్రభుత్వం కొరవడిరదని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. ఈ అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతిని (%ూతీవంఱసవఅ్%) సంప్రదించాల్సిందిగా హైకోర్టు తెలిపింది. ‘‘ప్రభుత్వం పనిచేయడం లేదని మేమెలా ప్రకటించగలం? దానిని నిర్ణయించడానికి లెఫ్టినెంట్ గవర్నర్‌కు పూర్తి సమర్థత ఉంది. గవర్నర్‌కు మా మార్గదర్శకత్వం అవసరం లేదు. చట్టానికి అనుగుణంగా ఏం చేయాలో.. గవర్నర్ అది చేస్తాడు’’ అని హైకోర్టు పేర్కొంటూ.. ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో.. కేజ్రీవాల్‌కు ఊరట లభించినట్లయ్యింది.